కోహ్లీ సేన : మరో సమరానికి సిద్దం

SMTV Desk 2019-01-22 18:48:59  Team india, Virat kohli, Kane Williamson, Newzealand vs India

న్యూ ఢిల్లీ, జనవరి 22: భారత క్రికెట్ జట్టు మరో సమరానికి సిద్దమవుతుంది. ఈ మధ్యే ఆసిస్ తో జరిగిన మ్యాచ్ లల్లో ఘన విజయం సాధించిన టీం ఇండియా ఇప్పుడు న్యూజిలాండ్ తో తలపడడానికి సిద్దమయింది. సోమ, మంగళవారాల్లో ప్రాక్టీసు పూర్తి చేసుకున్న టీమిండియా ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం మ్యాచ్‌కు కోహ్లీ సేన ఎదురుచూస్తుంది. ఆస్ట్రేలియా తలపడటమే సవాల్ అనుకుంటే అంతకుమించి క్లిష్టంగా ఉండనుంది ఈ పర్యటన. ప్రపంచ కప్ లోపు మిడిల్ ఆర్డర్ వైఫల్యాన్ని సరిచేసుకోవాలని ప్రయత్నిస్తున్న టీమిండియాకు ఇది మంచి ప్రాక్టీస్ టోర్నీలా ఉండనుంది. ఆస్ట్రేలియా పర్యటనలో జరిగిన వన్డేల్లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో మెరిపిస్తున్న ధోనీపైనే అన్నీ ఆశలు పెట్టుకున్న భారత్ మిడిల్ ఆర్డర్‌లో ఆదుకుంటాడనే ఆశాభావంతో ఉంది.

కానీ టీమిండియాను న్యూజిలాండ్ సీమింగ్ విభాగంతో బలంగా ఢీకొట్టాలని యత్నిస్తోంది. ట్రెంట్ బౌల్ట్, ఫెర్గ్యూసన్, టిమ్ సౌతీలు కలిసి కోహ్లీసేనను కట్టడి చేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. చరిత్రలో న్యూజిలాండ్‌ను వారి గడ్డపైనే భారత్ ఓడించడంలో చాలాసార్లు విఫలమైంది. 35వన్డేలు ఆడిన టీమిండియా కేవలం 10మాత్రమే గెలిచింది. జనవరి 23 నుంచి జరగనున్న ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా సోమవారం ఉదయం 7.30గంటలకు నేపియర్ వేదికగా తొలి మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మేర భారత జట్టు ఆదివారమే న్యూజిలాండ్ చేరుకుంది. కాగా, మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ 3, స్టార్ స్పోర్ట్స్ 3 హెచ్‌డీ, హాట్ స్టార్, జియో టీవీ, ఎయిర్ టెల్ ఛానెళ్లలో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

ఇండియా జట్టు :

రోహిత్ షర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి(కెప్టెన్), ధోని, కేదర్ యాదవ్, దినేష్ కార్తిక్, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, MDషమీ, యుజ్వేంద్ర చాహల్, అంబటి రాయుడు, శుబ్మన్ గిల్, కులదీప్ యాదవ్, MDషిరాజ్, కె. ఖలీల్ అహ్మద్

న్యూజిలాండ్ జట్టు :

మార్టిన్ గుప్తిల్, కోలిన్ మున్రో, కేన్ విల్లియంసన్(కెప్టెన్), రోస్స్ టైలర్, టామ్ లథం, కొలిన్ డి గ్రాన్దోమ్మే, మిట్చేల్ సంట్నేర్, టిం సౌతీ, ఇష్ శోది, ట్రెంట్ బౌల్ట్, లోకీ ఫెర్గుసన్, హెన్రీ నికోల్ల్స్, డౌగ్ బ్రాస్ వెల్, మాట్ట్ హెన్రీ