భారీ ఫీచర్లతో వివో కొత్త మొబైల్..

SMTV Desk 2019-01-22 16:00:30  vivo, new mobile, vivo Y89, chaina, smart phone

హైదరాబాద్, జనవరి 22: మొబైల్ తయారీ సంస్థ వివో భారీ ఫీచర్లతో కొత్త ఫోన్ రిలీజ్ చేసింది. వివో వై89 పేరిట చైనాలో ఓ నూతన స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ అరోరా పర్పుల్, బ్లాక్ గోల్డ్ రంగులలో లభిస్తుంది. దీనిలో 6.26 అంగుళాల టచ్ స్క్రీన్, స్నాప్ డ్రాగన్ 626 ప్రాసెసర్ లాంటి ఆకట్టునే ఫీచర్లు ఉన్నాయి. మన దేశంలో దీని ధర సుమారు రూ.16,700 లని అంచనా. 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల ఈ ఫోన్ ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తుంది.

ప్రత్యేకతలు:

➤ 16 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
➤ 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌
➤ 6.26" ఫుల్ హెచ్డీ ప్ల‌స్ డిస్ప్లే
➤ 16/2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు
➤ ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఆపరేటింగ్ సిస్టం
➤ 3260 ఎంఏహెచ్ బ్యాట‌రీ
➤ ఆక్టాకోర్ 626 ప్రాసెసర్