ఆధార్ ఒరిజినల్ రాబోతుంది ...

SMTV Desk 2019-01-22 13:43:40  Aadhar card, Original Aadhar , Uidai, Meeseva, Aadhar center, modified Aadhar card

న్యూఢిల్లీ,జనవరి 22: ఆధార్‌ కార్డు పోయిన లేదంటే అందులో ఎటువంటి మార్పులుచేర్పులు చేసినా కొద్ది రోజుల తర్వాత మీసేవా కేంద్రాలకో, ఆధార్‌ కేంద్రాలకో వెళ్లి మనమే డౌన్‌లోడ్‌ చేసుకుంటాం. ఇవి కొంత నాసిరకంగా, మునుపటి వాటితో పోల్చితే చాలా పల్చగా ఉంటాయి. అయితే ఇక నుంచి ఆధార్‌ వొరిజినల్ కార్డులను నేరుగా విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) నుంచే పొందవచ్చు. ఆధార్‌కార్డు ప్రవేశపెట్టిన తొలినాళ్లలో పోస్టులో ఇంటికి పెద్ద కార్డులు వచ్చేవి. ఇప్పుడూ అలానే వస్తాయన్నమాట. పైలట్‌ ప్రాజెక్టుగా యూఐడీఏఐ దీనిని మళ్లీ చేపట్టింది. ఆధార్‌ కేంద్రాలు, మీసేవా కేంద్రాల్లో తీసుకున్న కార్డులు చెల్లుబాటు అయినా భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, దీనికితోడు వొరిజినల్‌తో కూడిన దానికి డిమాండ్‌ అధికంగా ఉందని యూఐడీఏఐ అధికారి వొకరు తెలిపారు.

దరఖాస్తు చేసుకోవడం ఎలా..

•resident.uidai.gov.in/aadhaarreprint వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆధార్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలి.

•తర్వాత అక్షరాలు, అంకెలు గల సెక్యూరిటీ కోడ్‌(కేప్చా)ను ఎంటర్‌ చేయాలి.

•మీకు ఎంఆధార్ యాప్‌ ఉంటే.. అందులో i have t otp బాక్స్‌ సెలెక్ట్‌ చేసుకోవాలి.

•టీవోటీపీ లేకపోతే రిక్వెస్ట్‌ ఫర్‌ ఓటీపీ బటన్‌పై క్లిక్‌ చేయాలి.

•ఆధార్‌తో రిజిస్టర్‌ అయిన నంబరుకు వచ్చిన ఓటీపీని సంబంధిత బాక్సులో ఎంటర్‌ చేసి సబ్మిట్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి.

తర్వాత రూ.50 కట్టాల్సి ఉంటుంది. ఆధార్‌కార్డును మీ అడ్రస్‌కు యూఐడీఏఐ పోస్టులో పంపుతుంది.