భరత మాతకు తాకినా 'మీటూ'..

SMTV Desk 2019-01-22 11:39:30  Chennai, Layola college, art festivals, Narendra Modi, PM Narendra Modi, Bharatha Mata, Gauri Lankesh Murder

చెన్నై, జనవరి 22: మద్రాసులోని లయోలా కాలేజీ నిర్వహించిన ఓ ఆర్ట్‌ ఫెస్టివల్‌ వివాదాస్పదంగా మారింది. ఈ ఫెస్టివల్‌లో ప్రదర్శించిన కొన్ని చిత్రాలకు ‘భరత మాత కూడా మీటూ బాధితురాలే , ‘రచయిత గౌరీ లంకేష్‌ హత్యతో ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధం ఉంది , ‘ప్రధాని నరేంద్ర మోదీ సామ్రాజ్యవాదాన్ని అనుసరిస్తారు అంటూ వివాదాస్పద క్యాప్షన్లు పెట్టారు. దీనిపై పలువురు భాజపా నాయకులు,కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసారు. లయోలా కాలేజీలో ఈ నెల 19, 20 తేదిల్లో ‘స్ట్రీట్‌ అవార్డ్‌ ఫెస్టివల్‌ పేరుతో ఆర్ట్‌ ఫెస్టివల్‌ నిర్వహించారు. ‘అక్మే బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ లో చోటు సంపాదించడం కోసం నిర్వహించిన ఈ ఫెస్టివల్‌ వివాదాస్పదంగా మారింది. ఇక్కడ ప్రదర్శించిన కొన్ని చిత్రాలు, వాటి క్యాప్షన్‌లు ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీని కించపరిచేలా ఉన్నాయి.

దీంతో ఆగ్రహించిన భాజపా కార్యకర్తలు కాలేజీ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై బీజేపీ కార్యకర్తలు మాట్లాడుతూ.. ‘‘స్ట్రీట్‌ అవార్డ్‌ ఫెస్టివల్‌ అని చెప్పారు. స్ట్రీట్‌ అవార్డ్స్‌ అంటే.. మన జాతీయ చిహ్నాలను.. దేశ ప్రధానిని అవమానించడమేనా అని ప్రశ్నించారు. లయోలా కాలేజీ ఇలాంటి కార్యకార్యక్రమాలు చేపట్టి లౌకిక భావనను పూర్తిగా దెబ్బ తీస్తుదన్నారు. జాతీ వ్యతిరేక, హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు అనుమతి ఇస్తున్నారం టూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వొక వేళ కాలేజీ యాజమాన్యమే ఈ కార్యకలపాలను ప్రోత్సాహిస్తే.. కేంద్రం నుంచి కాలేజికి వచ్చే నిధులను నిలిపివేయాలంటూ ప్రభుత్వాన్ని కోరతామ ని హెచ్చరించారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో దీనిపై స్పందించిన కాలేజీ యాజమాన్యం దిద్దుబాటు చర్యలకు దిగింది. కాలేజీ ప్రాంగణంలో ఇలాంటి కార్యక్రమాల జరిగినందుకు తాము ఎంతో బాధపడుతున్నామని.. క్షమించమని కోరింది.