మరో మెగా హీరో ఎంట్రీ..

SMTV Desk 2019-01-21 12:16:41  chiranjeevi, sai dharma tej, vaishnav tej, new mega hero entry

హైదరాబాద్, జనవరి 21: మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలామంది కుర్ర హీరోలు వచ్చేశారు. వాళ్ళ ప్రత్యేకతను చాటుకుంటూ తమదైన శైలిలో దూసుకెళుతున్నారు. ఈ జాబితాలో మరో మెగా హీరో చేరుతున్నారు. చిరంజీవి మేనల్లుడు హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ రోజు ఈ చిత్ర షూటింగ్ లాంఛనంగా ప్రారంభమవుతోంది.



దర్శకుడు సుకుమార్ .. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టు లుక్ పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్ లో జాలరి వేషధారణలో వైష్ణవ్ తేజ్ కనిపిస్తున్నాడు. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ .. "2009 లో హీరోగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నా ప్రయాణం మొదలైంది. అప్పటి నుంచి కూడా నేను నటన పరంగా చాలా విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాను. ఈ ఏడాది మా లిటిల్ బ్రదర్ వైష్ణవ్ తేజ్ తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయమవుతున్నాడు. నన్ను ఆదరించినట్టే నా సోదరుడిని ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అని అన్నాడు.