ఆస్ట్రేలియన్ ఓపెన్ లో షరపోవాకు ఎదురు దెబ్బ

SMTV Desk 2019-01-20 18:03:38  Mariya sharapova, Australian opens, Tennis, Ash barty

ఆస్ట్రేలియా, జనవరి 20: ఆస్ట్రేలియాలో జరుగుతున్న ప్రీక్వార్టర్స్ లో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అగ్ర క్రీడాకారిణీ రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవా ఓటమి పాలైంది.

ఫ్రీక్వార్టర్స్‌లో ఆష్‌బార్టీతో జరిగిన మ్యాచ్‌లో 4-6, 6-1, 6-4 సెట్ల తేడాతో షరపోవా పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో ఆష్‌బార్టీ కెరీర్‌లోనే తొలి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్ ఫైనల్ చేరింది. క్వార్టర్స్‌లో ఆమె క్వితోవాతో తలపడనుంది.