'RX100'బ్యూటి ఎమోషనల్ ట్వీట్...!!!

SMTV Desk 2019-01-20 16:56:22  Payal rajput, RX 100 Movie heroin, Payal rajpt brother missing

హైదరాబాద్, జనవరి 20: ప్రముఖ అందాల తార, RX 100 బ్యూటి పాయల్ రాజ్ పుట్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఈరోజు పాయల్ తమ్ముడి పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. పాయల్ రాజ్ పుత్ సోదరుడు ధృవ్ రాజ్ పుత్ గత మూడు సంవత్సరాలుగా కనిపించడం లేదట. 25 ఏళ్ల అతడు 2016 మార్చి నుండి కనిపించడం లేదని పేర్కొంటూ పాయల్ ట్విట్టర్ లో ఫోటోలను షేర్ చేసింది.

నిన్ను చూడకుండా గడపడం చాలా కష్టంగా ఉంది. నువ్వు తిరిగి వస్తావని ఆశిస్తున్నాం. ఈరోజు నీ పుట్టినరోజు.. ఆ దేవుడు నీకు ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. నువ్వు లేవని అమ్మానాన్న ఎంతో బాధ పడుతున్నారు. ఈ సందేశం నీకు అందుతుందని భావిస్తున్నాను. వొకవేళ నువ్వు ఏదైనా ఆపదలో చిక్కుకొని ఉంటే మాకు ఫోన్ చెయ్.. నీ కోసం ఎదురుచూస్తున్నాం తమ్ముడు అంటూ పోస్ట్ లో రాసుకొచ్చింది.

తన సోదరుడు తప్పిపోయిన విషయంపై పాయల్ కంప్లైంట్ చేసినా.. పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదని వెల్లడించింది.