చరిత్ర సృష్టించిన కోహ్లీ సేన

SMTV Desk 2019-01-18 19:13:10  Team India VS Australia 3rd ODI, Melbourne, india won match, Virat kohli

న్యూ ఢిల్లీ, జనవరి 18: ఆసిస్ జట్టుపై టీం ఇండియా వరుసగా విజయ భేరిని మ్రోగిస్తూ పోతోంది. ఇదివరకు ఆసిస్ గడ్డపై కోహ్లీ సేనా అఖండ విజయాన్ని అందుకొని మళ్ళీ అదే గడ్డపై మరో సంచలన విజయాన్ని సొంత చేసుకుంది టీం ఇండియా. అంతే కాక కెప్టెన్ గా విరాట్ కోహ్లీ కూడా తన ఖాతాలో అరుదైన రికార్డులను చేధిస్తూ వెళ్తున్నాడు. తాజాగా మూడు వన్డేల సీరిస్ ను కూడా 2-1 తేడాతో గెలుచుకుని కెప్టెన్ గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా జట్టుపై వరుసగా ఇలా టెస్ట్ సీరిస్, వన్డే సీరిస్ లను గెలుచుకున్న ఏకైక భారత కెప్టెన్ గా కోహ్లీ నిలిచాడు. ఆస్ట్రేలియా జట్టుపై వారి స్వదేశంలోనే టీ20, టెస్ట్, సీరిస్ లను సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. మూడు వన్డేల సీరిస్ లో మొదటి రెండు మ్యాచుల్లో చెరోటి గెలుచుకున్న ఆసిస్, భారత్ లు సీరిస్ దక్కించుకోడానికి మూడో వన్డేలో హోరాహోరీగా తలపడ్డాయి. అయితే భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ ను 2-1 తేడాతొ సొంతం చేసుకుంది. మూడో వన్డేను ఏడు వికెట్ల తేడాతో గెలుచుకుంది.



మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి తన సత్తా చాటి భారత్ కు విజయాన్ని అందించాడు. అతను 114 బంతుల్లో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కేదార్ జాదవ్ 57 బంతుల్లో 61 పరుగులు చేశాడు. చివరలో విజయానికి వొక్క పరుగు కావాల్సి ఉండగా కేదార్ జాదవ్ ఫోర్ బాదాడు. దీంతో భారత్ ఆస్ట్రేలియా తన ముందు ఉంచిన 231 పరుగుల లక్ష్యాన్ని నాలుగు బంతులు మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది.భారత్ 3 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఇలా టెస్టు మరియు వన్డే సిరీస్‌ను కూడా గెలుచుకుని కోహ్లీ సేన చరిత్ర సృష్టించింది. ఇది అత్యంత విలువైన, ఘనమైన విజయమనే చెప్పాలి. ఈ సీరిస్ మొత్తంలో రాణించిన ధోని మరోసారి మ్యాచ్ విన్నర్‌నని నిరూపించుకున్నాడు. మహేంద్ర సింగ్ ధోని, కేదార్ జాదవ్ అద్భుతమైన హాప్ సెంచరీలతో భారత్ ను విజయానికి చేరువ చేశారు. చాహెల్ తన అద్భుతమైన బౌలింగ్ తో ఆరు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు.