NTR 'కథానాయకుడు’ రివ్యూ..

SMTV Desk 2019-01-09 14:51:56  NTR Biopic, Kathanayakudu, Balakrishna, Krish, kalyan ram, Movie review

హైదరాబాద్, జనవరి 9: బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా యన్.టి.ఆర్ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రాన్ని కథానాయకుడు , మహానాయకుడు రెండు భాగాలుగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు కథానాయకుడు రిలీజ్ అయ్యింది. రెండో భాగం మహానాయకుడు ఫిబ్రవరి 7న విడుదలకానుంది. ఇక ఈరోజు వచ్చిన కధానాయకుడు విషయానికి వస్తే, ఈ సినిమాకి బాలకృష్ణ పోషించిన 63 గెటప్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దాంతో పాటు ఎన్టీఆర్ పార్టీ స్థాపించటం, చిత్ర క్లైమాక్స్ హైలెట్ గా నిలిచాయి. అయితే కొన్ని సన్నివేశాల్లో నిడివి ఎక్కువ ఉండటం వల్ల, ఎన్టీఆర్ సినిమాలు ఇప్పటికే ఎక్కువ సార్లు చుసిన కారణం సినిమాకు మైనస్ అయ్యింది.

తారాగ‌ణం: బాల‌కృష్ణ‌, విద్యాబాల‌న్‌, కళ్యాణ్ రామ్, రానా, సుమంత్, ప్రకాష్ రాజ్, కైకాల సత్యనారాయణ, రకుల్ ప్రీత్ సింగ్, నిత్యా మీనన్, బ్రహ్మానందం తదితరులు.
సంగీతం: ఎం.ఎం.కీర‌వాణి
స‌మ‌ర్ప‌ణ‌: సాయికొర్రపాటి, విష్ణు ఇందూరి
నిర్మాణ సంస్థ‌లు: ఎన్‌.బి.కె.ఫిలింస్, వారాహి చ‌ల‌న చిత్రం, విబ్రి
స‌హ నిర్మాత‌లు: విష్ణు ఇందూరి, సాయికొర్ర‌పాటి
నిర్మాత‌లు: న‌ంద‌మూరి వ‌సుంధ‌రా దేవి, నందమూరి బాల‌కృష్ణ‌
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: జాగ‌ర్ల‌మూడి క్రిష్‌


క‌థ‌:
బ‌స‌వ తార‌క‌మ్మ‌(విద్యాబాల‌న్) 1984లో చెన్నై అడ‌యార్ క్యాన్స‌ర్ హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకుంటూ ఉంటుంది. ఆమెను క‌ల‌వ‌డానికి ఆమె కొడుకు హ‌రికృష్ణ‌(క‌ల్యాణ్ రామ్‌) అక్క‌డికి వ‌స్తాడు. ఆమె య‌న్‌.టి.ఆర్ ఆల్బ‌మ్ చూడ‌టంతో సినిమా స్టార్ట్ అవుతుంది. నంద‌మూరి తార‌క రామారావు(బాల‌కృష్ణ‌) రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ప‌నిచేస్తుంటాడు. అక్క‌డ లంచాలు తీసుకుని ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డాన్ని స‌హించ‌లేక మానేసి సినిమాల్లోకి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. చెన్నై వెళ్ళి ఎల్‌.వి.ప్ర‌సాద్‌గారిని క‌లుస్తాడు. అక్క‌డి నుంచి ఆయ‌న జీవితంలో సినిమా ఓ భాగంగా ఎలా మారింది. న‌టుడి నుంచి అగ్ర క‌థానాయ‌కుడిగా ఎదిగే క్ర‌మంలో ఆయ‌న ఎదుర్కొన్న స‌వాళ్లు ఏంటి? ఆయ‌న‌ చేసిన పాత్ర‌లు, ఆయ‌న ప్ర‌యాణం.. ఇత‌రుల‌తో ఆయ‌న నడుచుకునే తీరు.. సినిమాల‌పై ఆయ‌న‌కున్న క‌మిట్‌మెంట్.. సాధార‌ణంగా ఎన్టీఆర్ సినిమాల గురించి తెలుసు.. రాజ‌కీయంగా కూడా ఆయ‌నేంటో తెలుసు. మ‌రి ఆయ‌న‌ గురించి తెలియ‌ని విషయాలని ఈ సినిమాలో ఏమైనా చూపించారా? అంటే అవ‌న్నీ థియేటర్ కి వెళ్ళి చూడాల్సిందే.

ప్ల‌స్ పాయింట్స్‌:
➤ క్రిష్ ద‌ర్శ‌క‌త్వం
➤ న‌టీన‌టులు
➤ సంగీతం, నేప‌థ్య సంగీతం
➤ కెమెరా ప‌నిత‌నం
➤ ఎమోష‌న‌ల్ స‌న్నివేశాలు
➤ ఎడిటింగ్‌

మైన‌స్ పాయింట్స్‌:
➤ యంగ్ ఎన్టీఆర్ పాత్ర‌లో బాల‌కృష్ణ కొన్ని స‌న్నివేశాల్లో సెట్ అయిన‌ట్లు అనిపించ‌లేదు.
➤ నిడివి ఎక్కువ‌గా ఉండ‌టం

రేటింగ్ : 3/5