భారత్, పాక్‌ యుద్ధంపై ఇమ్రాన్‌ వ్యాఖ్యలు..

SMTV Desk 2019-01-08 17:18:44  Imran Khan, India, Kashmir, Pakistan, IND Vs Pak War

ఇస్లామాబాద్‌, జనవరి 8: పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ శాంతి ప్రక్రియ కోసం తాను చేసిన అబ్యర్ధనలపై భారత్‌ స్పందించడం లేదని వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య యుద్ధం అనివార్యమైతే అది సదుద్దేశ ఆత్మహత్య అని హెచ్చరించారు. భారత్‌ చర్చలకు పాక్‌ సంసిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు. ఇరు దేశాల ప్రయోజనాలకు కోల్డ్‌ వార్‌ సైతం వాంఛనీయం కాదని టర్కీ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు.

ఇరు దేశాలు సమస్యల పరిష్కారానికి ద్వైపాక్షిక చర్చల ద్వారా చొరవ చూపాలన్నారు. చర్చల ప్రతిపాదనను భారత్‌ పలుమార్లు తోసిపుచ్చిందన్నారు. కాశ్మీర్ ప్రజల హక్కులను భారత్‌ ఎన్నడూ అణిచివేయలేదన్నారు. అయితే 2016లో భారత్‌లో పాక్‌ ప్రేరేపిత ఉగ్రదాడులు జరిగిన దరిమిలా పాక్‌ భూభాగంలో భారత్‌ మెరుపు దాడులు చేపట్టిన నేపథ్యం‍లో ఇరు దేశాల మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి.