'కే.జి.ఎఫ్' రివ్యూ హిట్టా...ఫట్టా...

SMTV Desk 2018-12-21 12:01:55  K.G.F, Yash, Srinidhi shetty, Achyuth kumar, Malavika avinash, Ananth nag, Prashanth neel, Ravi, Tanishq, K.G.F Movie review

టైటిల్: కే.జి.ఎఫ్
నటీనటులు: యశ్,శ్రీనిధి శెట్టి,అచ్యుత్ కుమార్,మాళవిక అవినాష్,అనంత్ నాగ్,వశిష్ట ఎన్.సింహ,అయ్యప్ప శర్మ,బీసు సురేష్ తదితరులు
కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: ప్రశాంత్ నీల్
సంగీతం: రవి,తనిష్క్
సినిమాటోగ్రఫీ: భువన్ గౌడ
ఎడిటింగ్: శ్రీకాంత్
నిర్మాత: విజయ్ కిరగండూర్

రేటింగ్: 4.25/5

కన్నడ రాకింగ్ స్టార్ యాష్ హీరోగా నటించిన మూవీ ‘కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా నేడు విడుదలైంది. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మాతగా రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘కేజీఎఫ్ లో యాష్‌కి జోడీగా శ్రీనిధి శెట్టి నటించారు.





ఈ చిత్రాన్ని తెలుగులో వారాహి చలన చిత్ర బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి విడుదల చేశారు. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఏక కాలంలో భారీ హంగులతో రూపొందిన ఈ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి, బాహుబలి స్టార్ ప్రభాస్‌లు ప్రమోట్ చేయడంతో విపరీతమైన హైప్ వచ్చింది. పాజిటివ్ బజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ట్విట్టర్‌లో మంచి రెస్పాన్స్ వస్తోంది.

విడుదలకు ముందే సోషల్ మీడియాలో సినిమాలకు ఫస్ట్ రివ్యూ ఇచ్చే సినీ విశ్లేషకులు, సెన్సార్‌బోర్డ్ మెంబర్, ఆసియన్ మూవీస్ మార్కెటింగ్ ఎక్స్‌పర్ట్ అయిన ఉమైర్ సంధు ‘కేజీఎఫ్ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. హీరో యాష్ అదరగొట్టేశాడని.. ఈ ఏడాదిలోనే బిగ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ఇదే అంటూ చప్పట్ల వర్షం కురిపిస్తూ ఎమోజీలను షేర్ చేశారు.

ఆయనతో పాటు మరికొంత మంది నెటిజన్లు ‘కేజీఎఫ్ చిత్రంపై పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ఫస్టాఫ్ బాగుందని.. సెకండాఫ్ ఊర మాస్ అంటున్నారు. 1970 ప్రాంతంలో కోలార్ బంగారు గనుల్లో పనిచేసిన కార్మికుల జీవితాల ఆధారంగా తీసిన యాక్షన్ ప్రధాన చిత్రమే ‘కేజీఎఫ్ అని.. రాఖీగా హీరో యాష్ డైనమిక్ పాత్ర పోషించాడని ప్రశంసలు కురిపిస్తున్నారు.