లెనోవో జడ్5 ఎస్

SMTV Desk 2018-12-09 15:47:57  lenovo z5 s , triple camera

హైదరాబాద్ , డిసెంబర్ 09 : చైనా మొబైల్ మేకర్ లెనోవో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తుంది . ఖలెనోవో జడ్ 5 ఎస్గ పేరుతో వస్తున్న ఈ ఫోన్‌ను ఈ నెల 18న చైనాలో విడుదల చేయబోతోంది. నిజానికి ఈ ఫోన్‌ రెండు రోజుల క్రితమే విడుదల కావాల్సి ఉండగా, సాంకేతిక కారణాల వల్ల 18కి వాయిదా పడింది. ఈ ఫోన్‌కు సంబంధించి లీకైన వివరాల ప్రకారం వెనకవైపు నిలువుగా మూడు కెమెరాలు (ట్రిపుల్ కెమెరా) ఉన్నాయి. లెనోవో నుంచి ఇటీవల వచ్చిన జడ్ 5 ప్రొలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉండగా, ఇందులో మూడు కెమెరాలు ఉండడం విశేషం. కెమెరా సెటప్‌ను పక్కనపెడితే మిగతా ఫీచర్లు ఇంచుమించుగా జడ్5 ప్రొను పోలి ఉండనున్నట్టు సమాచారం. మరిన్ని విషయాల కోసం ఇంకాస్త సమయం పట్టొచ్చు