మార్వెల్ కామిక్స్ ఫౌండర్ ఇకలేరు

SMTV Desk 2018-11-13 12:48:08  Stan lee, Founder of the marvel comics, Father of pop culture, Died

లాస్ ఏంజిల్స్‌, నవంబర్ 13: ఫాదర్ ఆఫ్ పాప్ కల్చర్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ హాలీవుడ్ రచయిత, ఎడిటర్, పబ్లిషర్ స్టాన్ లీ నిన్న రాత్రి లాస్ ఏంజిల్స్‌లోని సిడార్స్ సినాయ్ మెడికల్ సెంటర్‌లో కన్నుమూశారు. హాలీవుడ్ లో మార్వెల్ కామిక్స్ ని పరిచయం చేసింది ఈయనే. ఇతన్ని ఫౌండర్ ఆఫ్ ది మార్వెల్ కామిక్స్ అని కూడా పిలుస్తారు. 1922 లో జన్మించిన స్టాన్ లీ కి ప్రస్తుతం 95 సవంత్సరాలు వుంటాయి. ఈయన మార్వెల్ కామిక్స్ కోసం 1961లో తొలిసారి ద ఫెంటాస్టిక్ ఫోర్ క్యారెక్టర్లను క్రియేట్ చేసారు. ఆ తర్వాత స్పైడర్ మ్యాన్‌, ద ఇంక్రెడిబుల్ హల్క్, ఎక్స్‌-మెన్‌, థోర్‌, ఐరన్ మ్యాన్‌, బ్లాక్ ప్యాంథర్ లాంటి సూపర్ హీరో క్యారెక్టర్లనూ సృష్టించాడు. గత ఏడాది స్టాన్ లీ భార్య అనారోగ్యంతో కన్నుమూసారు.