సర్కార్ వివాదం : రివెంజ్ తీసుకుంటున్న విజయ్ ఫ్యాన్స్

SMTV Desk 2018-11-12 19:08:43  Vijay Thalapathy, DMK party, Sarkar, Tamilanadu

తమిళనాడు, నవంబర్ 12: తెలుగు, తమిళంలో విడుదలయిన చిత్రం సర్కార్. విజయ్, మురగదాస్ కాంబినేషన్ లో వొచ్చినా ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద చక్కటి వసూళ్లతో దూసుకుపోతోంది. కాగా ఈ చిత్రంలో అధికార పార్టీ అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా డైలాగ్‌లు, సన్నివేశాలు ఉన్నాయని తమిళనాడు రాష్ట్ర మంత్రులు పలువురు ఆరోపించారు. పార్టీ కార్యకర్తలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ‘సర్కార్‌ ప్రదర్శితమవుతున్న థియేటర్ల వద్ద ఆందోళనలకు దిగారు. దర్శకుడు మురుగదాస్‌, విజయ్‌లను విమర్శించారు. దీంతో చిత్రంలోని కొన్ని సన్నివేశాల్ని తొలగించినట్లు తెలిసింది.



ఇలా తమ అభిమాన నటుడ్ని తప్పుపట్టడాన్ని విజయ్‌ అభిమానులు సహించలేకపోయారు. తమ హీరోను బాధపెట్టిన అన్నాడీఎంకే పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు అన్నాడీఎంకే ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన మిక్సీ, ల్యాప్‌టాప్, ఫ్యాన్‌ తదితర వస్తువుల్ని తమకు వద్దని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌ మాట్లాడుతూ దిగిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. విజయ్‌ను ఇబ్బందిపెట్టినందుకు ఇలా చేస్తున్నట్లు అభిమానులు పేర్కొన్నారు.