నామినేషన్లు మొదలైనా ఎటూ తేలని కూటమి సీట్లు

SMTV Desk 2018-11-12 15:28:14  Mahakootami, Telangana elections, Election nominations, Party leaders

హైదరాబాద్, నవంబర్ 12: తెలంగాణలో రాబోతున్న ఎన్నికల సందర్భంగా ఏర్పడిన మహాకూటమి సీట్ల పంపకాలు విషయం ఇంకా తేలలేదు. నామినేషన్లు ప్రారంభమైనా సీట్ల పంచాయితీ మాత్రం కొనసాగుతూనే వుంది. దీంతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, సీపీఐ నేతలు చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డిలు ఢిల్లీకి వెళ్లారు. సీపీఐ తమకు నాలుగు స్థానాలు ఇవ్వాలని పట్టుబట్టి కూర్చోవడంతో చర్చలు కొలిక్కి రావడంలేదని సమాచారం. అలాగే టీజేఎస్, సీపీఐలకు కేటాయించే స్థానాలపైనా స్పష్టత ఇవ్వలేదు. అయితే సీట్ల సర్దుబాటుతో పాటు అభ్యర్థుల జాబితాను ప్రకటించే ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఉత్తమ్ అధిష్ఠానం పెద్దలతో చర్చిస్తున్నారు. ఉత్తమ్ మాట్లాడుతూ.. ‘ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి పక్షాలు ఐక్యంగా ముందుకు సాగుతాయి. కూటమి మనుగడపై సందేహాలు అవసరం లేదు. తెలంగాణలో కూటమి సారథ్యంలోనే కొత్త ప్రభుత్వం ఏర్పాడుతుంది. కాగా కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ, కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ నేడు జరగనుండటంతో ఈ రోజు సాయంత్రం లేదా మంగళవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు.