పోలీసులకు లొంగిపోయిన మైనింగ్ మాఫియా డాన్

SMTV Desk 2018-11-10 18:24:06  Gali Janardhan Reddy, Ambidant Marketing Pvt ltd, Mining Mafia Don

హైదారాబాద్, నవంబర్ 10: అంబిడెంట్‌ మార్కెటింగ్‌ సంస్థ వేలాది మందిని మోసగించిన తరుణంలో నమోదైన ఈడీ కేసులను మైనింగ్ మాఫియా డాన్, బీజేపీ నేత, కర్ణాటక మాజీమంత్రివర్యులు గాలి జనార్దనరెడ్డి మాఫీ చేయిస్తానంటూ రూ.25 కోట్లకు చేసుకున్న డీల్ కర్ణాటకలో సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. అయితే శనివారం బెంగళూరు క్రైమ్ బ్రాంచి పోలీసు అధికారుల ముందు హాజరయ్యాడు. తాను ఎక్కడికీ పారిపోలేదని, ఐదు రోజులుగా నగరంలోని తన ఇంట్లోనే ఉన్నానని చెప్పుకొచ్చాడు. తాను ఏ తప్పూ చేయలేదని, పోలీసు విచారణకు సహకరిస్తానని అన్నాడు.

అంబిడెంట్ కంపెనీ కేసులో ఆయనపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీచేశారు. దీంతో నిన్ననే ఆయన న్యాయవాదులు ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఈ రోజు వారితో కలసి పోలీసుల ముందు లొంగిపోయారు గాలి. అంబిడెంట్ కంపెనీని విచారణ నుంచి రక్షించేందుకు కాపాడటానికి గాలి 57 కేజీల బంగారం తీసుకున్నారని, ఆయన ఇంట్లోని గోడలో వీటిని కనుక్కున్నామని అధికారులు చెబుతున్నారు. దీని కోసం ఈడీ అధికారికి రూ.కోటి లంచం ఇచ్చారని అంటున్నారు. అరెస్ట్ నుంచి తప్పించుకోడానికి పరారైన గాలి రెండు రోజులు ఢిల్లీలో తలదాచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంబిండెంట్ కంపెనీ 30 నుంచి 40 ప్రతిఫలం ఇస్తామని ప్రజల నుంచి వేల కోట్లు దండుకోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.