శృంగార సన్నివేశలు లీక్‌!

SMTV Desk 2018-11-10 13:07:20  Radhika Aapte, Radhika Aapte nude scenes,

బాలీవుడ్‌లో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్లలో రాధిక ఆప్లే వొకరు. ఏ విషయాన్నైనా దాచకుండా కుండ బద్దలుకొట్టినట్టుగా మాట్లాతుంటారు.కోలీవుడ్‌కు ‘ధోని చిత్రం ద్వారా పరిచయమైన హీరోయిన్‌ రాధిక ఆప్టే… తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో ‘కబాలి నటించిన సంగతి తెలిసిందే. ఈ సినీమాతో రాధిక ఆప్టే చాలా పాపులర్ అయ్యారు. అయితే అంతకు ముందే హిందీ, బెంగాలీ, మరాఠి తదితర భాషల్లో నటించిన ఆప్టే… ‘ధోని చిత్రంతో తెలుగు ప్రేక్షకులకూ పరిచయం అయ్యారు. అలా దశాబ్దాలకు పైగా నటిగా కొనసాగుతున్న ఈ ఉత్తరాది భామ ఇటీవల హాలీవుడ్ లోకి రంగ ప్రవేశం చేశారు. అప్పట్లోనే తన అంద చందాలను ఆరబోసేందుకు నాకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది. కానీ తాజాగా అదే విషయంలో షాక్ గురైందట! అంతగా తను ఎదుర్కొన్న సంఘటన ఏమిటంటే.

గ్లామర్ విషయంలో రెచ్చిపోతున్న ఈ భామకు చెందిన శృంగా భరిత సన్నివేశాలు దృశ్యాలు ఇంటర్నెట్‌, యూట్యూబ్ లలో హాల్ చల్ చేసి కలకలం సృష్టించాయి. అలాంటి వాటిని పట్టించుకోని రాధిక ఆప్టే… ఇప్పుడు వొక్కసారిగా షాక్ కు గురైంది. ఇందుకు కారణం లేకపోలేదు. ఆమె నటించిన ఆంగ్ల చిత్రం ‘పర్చెడ్ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్ దేవగన్ నిర్మించిన ఈ చిత్రంలో రాధిక ఆప్టే, నటుడు అదిల్ హుస్సేన్ తో కలిసి అర్ధనగ్న దుస్తుల్లో… ముఖ్యంగా టాప్ లెస్ దుస్తుల్లో నటించి ఓ రేంజీ లో యువతను ఆకట్టుకుంది.