దీపావళికి ఐక్యరాజ్య సమితి కానుకలు

SMTV Desk 2018-11-05 18:44:27  Diwali, United nations, Indian Festival

న్యూ యార్క్, నవంబర్ 5: ఈ దీపావళికి వొక్క భారత దేశమే కాదు యవత్ ప్రపంచమంతా దీపావళిని ఘనంగా జరుపుకునేందుకు సిద్దంగా వున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతీ చోటా పండగ సందడి నెలకొంది. కొత్త బట్టలు, ఇంటి నిండా దీపాలు,కొత్త అల్లుళ్ల రాకలు, ఆడపిల్లలకు కానుకలు, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు, చిన్నపిల్లల కాల్చే చిచ్చుబుడ్డిలు, కాకరబత్తులు, టపాసుల మోతలు మోగించేందుకు అందరూ రెడీ అవుతున్నారు. దీపావళి పండుగ గురించి మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా మన పండుగకు ప్రత్యేకత ఉంది. అందుకే కొన్ని దేశాలు దీపావళి పండుగ వస్తే మన భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలుపుతారు.



తాజాగా ఐక్యరాజ్య సమితి ( యూనైటెడ్ నేషన్స్) మన దీపావళికి అరుదైన గౌరవం ఇచ్చింది. ‘దీపావళి’పై ప్రత్యేక స్టాంప్‌ను కూడా విడుదల చేసింది. ఐక్యరాజ్య సమితి పోస్టల్ విభాగం తమ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.

‘హ్యాపీ దివాలీ’ విష్ లైటింగ్‌తో ఉన్న ఐక్యరాజ్య సమితి ఫొటోపై.. దీపావళి స్టాంప్ షీట్ల చిత్రాన్ని ప్రదర్శిస్తూ ట్వీట్ చేశారు. ప్రతి స్టాంప్ షీట్లో 10 స్టాంప్‌లు ఉంటాయి. వీటి విలువ 14.95 అమెరికా డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.1100). ఐక్యరాజ్యసమితి స్టాంప్స్ అధికారిక వెబ్‌సైట్‌‌ ద్వారా ఈ స్టాంప్‌లను కొనుగోలు చేయొచ్చు. ఇందుకోసం ఈ లింక్ https://unstamps.org/shop/diwali పై క్లిక్ చేస్తే చాలు. ‘దీపావళి’ ఈ గుర్తింపు ఈ గుర్తుంపు తీసుకొచ్చేందుకు దాదాపు ఏడేళ్లుగా కష్టపడుతున్నారు. అమెరికాలోని భారతీయులు, యునైటెడ్ స్టేట్స్ హౌస్ సభ్యురాలు డెమొక్రటిక్ పార్టీ నాయకులు కారోలైన్ బషెర్ మాలోని వంటి అమెరికా రాజకీయవేత్తల కష్టం ఫలితంగానే ‘స్టాంప్’ లభించింది.