మహాకూటమిలో కాంగ్రెస్ కి 95

SMTV Desk 2018-11-01 16:51:32  Mahakootami, Uttam Kumar Reddy, Congress, Sonia Gandhi

న్యూ ఢిల్లీ : మహాకూటమిలో కాంగ్రెస్ వాటా తెల్చేసుకుంది. అందులో మిగిలిన పార్టీలకు మాత్రం ఇంకా వెల్లడించలేదు. గురువారం టీకాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్, ఇతర నేతలు ఢిల్లీలో సోనియా గాంధీ నివాసంలో చర్చలు జరిపి ఎన్నికల కమిటీ సభ్యులు తెలంగాణ ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చించారు. టీడీపీ, టీజేఎస్ డిమాండ్లను అధినేతలకు వివరించారు.

అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి కుంతియా విలేకర్లతో మాట్లాడుతూ సీట్ల పంపకం కుదిరిందని ఉత్తమ్ చెప్పారు. ‘మేం 95 స్థానాల్లో పోటీ చేస్తాం. మిగిలిన 24 స్థానాలు మిత్రపక్షాలకు కేటాయించాం. వాటితో చర్చలు సాగుతున్నాయి. టీడీపీ 14 సీట్లకు అంగీకరించింది. త్వరగా జాబితాను ప్రకటిస్తాం.. ’ అని చెప్పారు. కుంతియా మాట్లాడుతూ.. 62 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగిందని, 57 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశామని వెల్లడించారు.

ఈ నెల(నవంబర్) 8 రాత్రిన మొత్తం జాబితా ప్రకటిస్తామని, మరుసట్రోజు ఉదయం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. కాగా, కోదండరాం సారథ్యంలోని టీజేఎస్ కు 6, సీపీఐకి 4 సీట్లు దక్కే అవకాశముందని చెబుతున్నారు. ఢిల్లీలో కోదండరాం రా హుల్ గాంధీతో భేటీ అవుతారని, 6 సీట్లుకు వొప్పుకుంటారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కోదండరాం 12 స్థానాలు కావాలని పట్టుబడుతున్నారు.