తగ్గిన పెట్రోల్ ధరలు

SMTV Desk 2018-10-30 17:26:25  Petrol, Diesel, Price

న్యూ ఢిల్లీ, అక్టోబర్ 30: దేశ వ్యాప్తంగా గత రెండు నెలలుగా పెట్రో ధరలు క్రమంగా పెరుగుతూ అందర్నీ భయాందోళనకు గురిచేసింది. ..అయితే గత 13రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యలో మంగళవారం దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 20 పైసలు తగ్గి రూ. 79.55కు చేరుకోగా, డీజిల్ ధర 9 పైసలు తగ్గి రూ. 73.78కు చేరింది. కాగా, హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 32 పైసలు తగ్గి రూ. 84. 54 చేరింది. డీజిల్ ధర 22 పైసలు తగ్గి రూ. 80.32గా ఉంది.