భారీ పరుగుల తేడాతో విండీస్ విఫలం

SMTV Desk 2018-10-30 13:15:12  4th ODI, West indies, India, Mumbai

ముంబై, అక్టోబర్ 30: భారత్ - విండీస్ తో జరుగుతున్న 5 వన్డేల క్రమంలో నాల్గో వన్డే ముంబయి వేదికగా జరిగిన మ్యాచ్ లో మొదట టాస్ గెటిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుని భారీ స్కోర్ చేసింది. బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ, అంబటి రాయుడులు సెంచరీలు చేయడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది. జట్టు స్కోర్ 71 పరుగుల వద్ద ఓపెనర్ శిఖర్ ధావన్(38) అవుట్ అయ్యాడు.

మరో ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అంబటి రాయుడు కూడా క్రీజ్ లోకి వచ్చినప్పటినుండి పరుగులు సాధిస్తూ రోహిత్ కి చక్కటి సహకారం అందించాడు. హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ 102 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్ సహాయంతో సెంచరీ చేసాడు. అనంతరం సొంత ప్రేక్షకుల మధ్య చెలరేగి ఆడుతూ 150 పరుగుల మార్క్ ను కూడా చేరుకున్నాడు. అయితే అదే ఊపులో నర్స్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. రోహిత్, రాయుడు కలిసి 211 పరుగుల బాగస్వామ్యంను నెలకొల్పారు.

రోహిత్ అవుట్ అయిన అనంతరం రాయుడు బౌండరీలు బాదుతూ విండీస్ బౌలర్లను ఆటాడుకున్నాడు. ఈ క్రమంలో 80 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్ సహాయంతో 100 పరుగులు చేసాడు. వెంటనే భారీ షాట్ ఆడి పెవిలియన్ చేరాడు. అనంతరం ధోనీ (23), జాదవ్ (16), జడేజా (7) పరుగులు చేసారు. విండీస్ బౌలర్ కీమర్ రోచ్ రెండు వికెట్లు తీసాడు.

ఇక విండీస్ విషయానికొస్తే 20 పరుగుల వద్ద ఓపెనర్‌ హేమ్‌రాజ్‌ (14), ప్రమాదకర షాయ్‌ హోప్‌ (0), కీరన్‌ పావెల్‌ (4) పెవిలియన్‌కు చేరడంతో ఆ జట్టు వొక్కసారిగా తడబడింది. అయినా క్రీజులో సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ మార్లన్‌ శామ్యూల్స్‌ (18), చిచ్చరపిడుగు హెట్‌మయెర్‌ (13) ఉండడంతో విండీస్ ను తక్కువ అంచనా వేయలేకపోయారు. అయితే పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ రంగంలోకి దిగి ముందుగా హెట్‌మయెర్‌ను ఎల్బీ చేయడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత తన వరుస ఓవర్లలో రోవెన్‌ పావెల్‌ (1), శామ్యూల్స్‌ను కూడా అవుట్‌ చేయడంతో విండీస్‌ 56 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్‌ జేసన్‌ హోల్డర్‌ వొక్కడే అర్ధ సెంచరీతో క్రీజులో నిలవగలిగాడు. అయితే ఆఖరి వికెట్‌ తీయడానికి భారత బౌలర్లు తొమ్మిది ఓవర్లపాటు చెమటోడ్చాల్సి వచ్చింది. చివరికి 36.2 ఓవర్లలో 153 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. వూహించని విధంగా విండీస్ భారీ పరుగుల తేడాతో భారత్ చేతిలో చిత్తు అయ్యింది

స్కోరు బోర్డు

భారత్‌: రోహిత్‌ శర్మ (సి) హేమ్‌రాజ్‌ (బి) ఆష్లే నర్స్‌ 162; శిఖర్‌ ధవన్‌ (సి) కీరన్‌ పావెల్‌ (బి) కీమో పాల్‌ 38; విరాట్‌ కోహ్లీ (సి) హోప్‌ (బి) రోచ్‌ 16; అంబటి రాయుడు (రనౌట్‌) 100; ఎంఎస్‌ ధోనీ (సి) హేమ్‌రాజ్‌ (బి) రోచ్‌ 23; కేదార్‌ జాదవ్‌ (నాటౌట్‌) 16; రవీంద్ర జడేజా (నాటౌట్‌) 7;

ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 50 ఓవర్లలో 377/5.

వికెట్ల పతనం: 1-71, 2-101, 3-312, 4-344, 5-355.

బౌలింగ్‌: కీమర్‌ రోచ్‌ 10-0-74-2; జేసన్‌ హోల్డర్‌ 9-0-62-0; ఆష్లే నర్స్‌ 8-0-57-1; పాల్‌ 10-0-88-1; రోవ్‌మన్‌ పావెల్‌ 4-0-23-0; ఆలెన్‌ 8-0-52-0; శామ్యూల్స్‌ 1-0-14-0.

వెస్టిండీస్‌: హేమ్‌రాజ్‌ (సి) రాయుడు (బి) భువనేశ్వర్‌ 14; కీరన్‌ పావెల్‌ (రనౌట్‌) 4; హోప్‌ (రనౌట్‌) 0; శామ్యూల్స్‌ (సి) రోహిత్‌ (బి) ఖలీల్‌ 18; హెట్‌మయెర్‌ (ఎల్బీ) ఖలీల్‌ 13; రోవ్‌మన్‌ పావెల్‌ (బి) ఖలీల్‌ 1; హోల్డర్‌ (నాటౌట్‌) 54; ఆలెన్‌ (సి) రోహిత్‌ (బి) కుల్దీప్‌ 10; నర్స్‌ (సి) రోహిత్‌ (బి) కుల్దీప్‌ 8; కీమో పాల్‌ (స్టంప్డ్‌) ధోనీ (బి) జడేజా 19; రోచ్‌ (బి) కుల్దీప్‌ 6;

ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 36.2 ఓవర్లలో 153 ఆలౌట్‌.

వికెట్ల పతనం: 1-20, 2-20, 3-20, 4-45, 5-47, 6-56, 7-77, 8-101, 9-132, 10-153. బౌలింగ్‌: భువనేశ్వర్‌ కుమార్‌ 5-1-30-1; బుమ్రా 8-1-25-0; ఖలీల్‌ 5-0-13-3; జడేజా 10-1-39-1; కుల్దీప్‌ 8.2-0-42-3.