మెగా ఆఫర్ కొట్టేసిన కేథరిన్

SMTV Desk 2018-10-26 18:17:40  Ram charan, Boyapati, Ketharin tresa

హైదరాబాద్, అక్టోబర్ 26: రంగస్థలం తర్వాత రాం చరణ్ బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. భరత్ అనే నేను సినిమా హిట్ అందుకున్న నిర్మాత డివివి దానయ్య ఈ సినిమా నిర్మిస్తున్నారు. కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాలో స్పెషల్ ఐటం సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నారట దర్శక నిర్మాతలు.

ఈ సాంగ్ లో చరణ్ తో కేథరిన్ త్రెసా నటిస్తుందని తెలుస్తుంది. తెలుగు తమిళ భాషల్లో హీరోయిన్ గా సినిమాలు చేస్తున్న కేథరిన్ క్రేజ్ తెచ్చుకోవడంలో వెనుకపడ్డది. ఈ సాంగ్ తో అయినా అమ్మడి ఫేట్ మారుతుందేమో చూడాలి. రంగస్థలం సినిమాలో స్పెషల్ సాంగ్ జిగేల్ రాణిగా పూజా హెగ్దె అలరించింది. రాబోతున్న వినయ విధేయ రామా సినిమాలో కేథరిన్ జిగేల్ రాణిగా మారుతుంది. ఊర మాస్ సినిమాల స్పెషలిస్ట్ అయిన బోయపాటి శ్రీను చరణ్ ఇమేజ్ కు తగినట్టుగానే ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడట. 2019 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.