రాహుల్ జోహ్రీపై సీవోఏ సభ్యులతో విచారణ...

SMTV Desk 2018-10-26 14:53:34  mee too, rahul johree, bcci, cbi, coa, diana edugi

హైదరాబాద్, అక్టోబర్ 26: మీ టూ ఉద్యమం రోజురోజుకి ఆగకుండా విజ్రుంబిస్తూనే ఉంది. అది బీసీసీఐ వరకూ పాకిన విషయం తెలిసిందే. బీసీసీఐ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న రాహుల్ జోహ్రీ పై కొద్ది రోజుల క్రితం వొక గుర్తుతెలియని మహిళా సామాజిక మాధ్యమాల్లో తన గురించి ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలు వాస్తవమో కాదో కానీ ఎదో వొకటి తెలిసే వరకు ఐసీసీ సమావేశాలకు కూడా హాజరు కావడానికి వీల్లేదంటూ బీసీసీఐ అతనిపై ఆంక్షలు విధించింది.

అయితే ఆ మహిళా చేసిన ఆరోపణలకి 14రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పరిపాలక కమిటీ రెండు వారాల క్రితం ఆదేశించగా.. శనివారం రాహుల్ జోహ్రి ఆ ఆరోపణల్ని కొట్టివేస్తూ తన వివరణని కమిటీకి సమర్పించాడు.





కమిటీలోని మహిళా సభ్యురాలు డయానా ఎడుల్జి ఆ వివరణపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సీఈవోని పదవి నుంచి అతడ్ని తప్పించాలని అభిప్రాయపడింది. కాగా రాహుల్ జోహ్రీ వివరణపై సోమవారం జరిగిన సమావేశంలో పరిపాలక కమిటీ చర్చించింది. రాహుల్ జోహ్రీపై చర్యలు తీసుకునేందుకు నివేదిక తర్వాత నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లు తెలుస్తోంది.

బీసీసీఐ సీఈవో రాహుల్‌ జోహ్రిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి విచారణ జరిపేందుకు సీవోఏ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది.

ఈ మేరకు అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ రాకేశ్ శర్మ ఛైర్మన్‌గా, ఢిల్లీ మహిళా కమీషన్ ఛైర్‌పర్సన్ బరాఖ్ సింగ్, సీబీఐ మాజీ డైరెక్టర్ పీసీ వర్మతో వో కమిటీని నియమించింది. 15రోజుల్లోపు ఈ కమిటీ నివేదిక ఇవ్వనుందని.. ఆ తర్వాతే రాహుల్ జోహ్రీ భవితవ్యంపై నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ పాలకుల కమిటీ వెల్లడించింది.