కుమారుడిని రాజీనామా, ఆ స్థానానికి పోటీ చేయనున్న తండ్రి.

SMTV Desk 2017-07-09 12:40:16  40, MLAs, rebelled, against, Chief, Minister

గువాహటి, జూలై 9 : ఒక్క ముఖ్యమంత్రిపై 40 మందికి పైగా ఎమ్మెల్యేలు ఎదురుతిరిగారు. పైగా ఎదురు తిరిగిన ఎమ్మెల్యేలంతా కాజీరంగా సమీపంలోని ఓ రిసార్ట్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వివరాలలోకి వెళితే, నాగాలాండ్ ముఖ్యమంత్రి షురోజెలీ లీజీట్సు రాష్ట్ర శాసనసభను రద్దు చేయడానికి వీలుగా తీర్మానాన్ని ఆమోదించేందుకు ప్రయత్నించారు. దీంతో తిరుగుబాటు చేపట్టిన ఎమ్మెల్యేలు మాజీ ముఖ్యమంత్రి టీఆర్ జెలియాంగ్‌ను మళ్ళీ తమ నూతన నేతగా ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారు. నాగాలాండ్ గవర్నర్ పీబీ ఆచార్య ప్రస్తుతం కోహిమాలో లేకపోవడంతో ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న తన కుమారుడి చేత రాజీనామా చేయించిన ముఖ్యమంత్రి షురోజెలీ, ఆ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో తానే స్వయంగా పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో ఆగ్రహించిన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. కాగా ఆయన కుమారుడు ఖ్రీయిహు గత నెలలోనే రాజీనామా చేశారు.