ఫేస్ బుక్ సంస్థ పదవుల్లో మార్పులు

SMTV Desk 2018-05-09 15:41:24  face book, fb management changes, fb data hack, san francisco

శాన్ ఫ్రాన్సిస్కో, మే 9 : వ్యక్తిగత సమాచార తస్కరణ తర్వాత పేస్ బుక్ సంస్థ దిద్దుబాటు చర్యలకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా సంస్థ తొలిసారిగా మేనేజ్‌మెంట్‌ టీంలో భారీ మార్పులు చేర్పులు చేసింది. దాదాపు 12మందికిపైగా ఎగ్జిక్యూటివ్‌ల పదవుల్లో మార్పులు చేసింది. ఇంజనీరింగ్‌, ప్రొడక్ట్‌ టీమ్స్‌ను మూడు యూనిట్లుగా విడదీసింది. ముఖ్యంగా ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపిన సమాచార గోప్యతా కుంభకోణం తరువాత నాయకత్వ బృందంలో మార్పులు చేసినట్టు ఫేస్‌బుక్‌ వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌, మెసెంజర్ యాప్‌ లాంటి ప్రధాన విభాగాలకు కొత్త వారిని నియమించింది. ముఖ‍్యంగా బ్లాక్‌చెయిన్‌ టూల్‌ను తిరిగి ప్రవేశపెడుతుంది. సంస్థ సహ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ మునుపటిలాగానే సీఈవోగా కొనసాగుతారు. ఇక సీఈవో తర్వాత రెండవ అతి కీలకమైన ఎగ్జిక్యూటివ్‌ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా షెరిల్ సాండ్‌బర్గ్‌ ఉంటారు. జుకర్‌బర్గ్‌ సర్కిల్‌లో దీర్ఘకాల సభ్యుడు, చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌గా ఉన్న క్రిస్ కాక్స్‌కు సంస్థ ప్రమోషన్‌ ఇచ్చింది. ఇకపై క్రిస్‌ ఫేస్‌బుక్‌ యాప్‌, స్మార్ట్‌ఫోన్‌సేవలు, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌, మెసెంజర్ యాప్‌లకు ప్రధాన ఇన్‌చార్జ్‌గా బాధ‍్యతలు నిర్వహిస్తారు. మరో ఎగ్జిక్యూటివ్ జేవియర్ ఆలివాన్ భద్రతా , "సోషల్ ప్రొడక్ట్ సర్వీసెస్" విభాగ నిర్వహణ బాధ్యతలను చేపడతారు.